Ranya Rao : బంగారం స్మగ్లింగ్.. ప్రముఖ నటి అరెస్ట్

by M.Rajitha |
Ranya Rao : బంగారం స్మగ్లింగ్.. ప్రముఖ నటి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం స్మగ్లింగ్ కేసు(Gold Smuggling Case)లో ప్రముఖ నటిని అరెస్ట్ చేశారు పోలీసులు. దుబాయ్(Dubai) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకు వస్తున్నారని కన్నడ స్టార్ నటి రాన్యా రావ్(Ranya Rao) ను విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రాన్యా 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్ళడంపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో నేడు దుబాయ్ నుంచి బెంగుళూరు ఎయిర్పోర్టు(Benguluru Airport)కు చేరుకున్న ఆమె వస్తువులను తనిఖీ చేయగా.. దాదాపు 15 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఆమె బంగారు బిస్కెట్లను లో దుస్తుల్లో దాచి అక్రమ రవాణా చేసిందనే అనుమానాలతో.. పోలీసులు పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే తాను డీజీపీ కుమార్తెను అని డీఆర్ఐ అధికారులకు తెలపగా.. తనని ఇంటివద్దకు చేర్చేందుకు పోలీసులకు కాల్ చేసి ఎయిర్పోర్టుకు పిలిపించుకోవడం గమనార్హం. అయితే ఈకేసులో ర్యానాతోపాటు పోలీసులు కూడా ఉన్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ర్యానా అరెస్ట్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఈ నటి కన్నడలో 'మాణిక్య', 'వాఘా', 'పటాకీ' వంటి టాప్ సినిమాల్లో నటించింది.

Next Story