Game Changer - గేమ్ చేంజర్‌ టికెట్ ధరల భారీగా పెంపు

by Mahesh |   ( Updated:2025-01-04 13:47:03.0  )
Game Changer - గేమ్ చేంజర్‌ టికెట్ ధరల భారీగా పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: అందరూ ఉహించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh State Govt) గేమ్ చేంజర్‌(Game changer) సినిమా టికెట్ ధరలు(Ticket prices) పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 13 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సినిమా యూనిట్‌కు పర్మిషన్ ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు(Orders) జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం గేమ్ చేంజర్ సినిమా తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే జనవరి 10న అర్ధరా3త్రి ఒంటిగంటకు మొదలయ్యే బెన్ఫిట్ షో‌కు టికెట్ పై రూ. 600 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే మిగిలిన ఐదు షోలకు మల్టీప్లెక్సుల్లో(Multiplex) రూ. 175 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ. 135 పెంచుకునేందుకు పర్మిషన్ లభించింది. ఈ ధరల పెంపు జనవరి 23 వరకు రోజుకు ఐదు షోల(Five shows)కు హైక్ తో టికెట్లు విక్రయించుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టికెట్ ధరలు(Ticket prices).. తాజా పెంపుతో మరింత భారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప-2 ఘటనతో తెలంగాణ ప్రభుత్వం బెన్ ఫిట్ షో లతో పాటు టికెట్ల ధరల పెంపునకు ముగింపు పలకడంతో.. రాష్ట్రంలో గేమ్ చేంజర్ ధరలు సాధరంగా ఉండనున్నాయి. కాగా ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shanker) మొట్టమొదటిసారి పూర్తి తెలుగులో భారీ బడ్జెట్ తో తీయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) హీరోగా నటించారు. ఈ సినిమా జనవరి 10న(On January 10) ప్రపంచ వ్యాప్తంగా(Worldwide) రిలీజ్ అవుతుంది.

Advertisement

Next Story