Bigg Boss-7: సీజన్‌కు నాగార్జున పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

by Hamsa |   ( Updated:2023-08-19 08:09:32.0  )
Bigg Boss-7: సీజన్‌కు నాగార్జున పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్’ సినిమాతో అలరించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం పలు షోస్‌తో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల్లో బిగ్‌బాస్‌ సందడి షురూ కానుంది. కంటెస్టెంట్లు ఎవరన్నది పక్కనపెడితే హోస్ట్‌ మాత్రం కింగ్‌ నాగార్జుననే ఉండబోతున్నాడు. ఇటీవల విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. వరుసగా నాలుగు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయన ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా చేయనున్నారు.

తాజాగా, బిగ్‌బాస్ కోసం నాగార్జున తీసుకునే పారితోషికం గురించి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్-7 సీజన్‌కు కనివనీ ఎరుగని రీతిలో రూ.200 కోట్లు తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ ఆధారాలు లేకుండా కొందరు లేని పోని రూమర్స్ సృష్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ, నెట్టింట మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Read More: ప్రభాస్ అభిమానులకు మరో బిగ్ అప్‌డేట్.. ‘కల్కి’లో మలయాళ యంగ్ హీరో కీ రోల్!

Advertisement

Next Story

Most Viewed