Venky Atluri: తెలుగు స్టార్లు అడిగిందానికి నేను ఒప్పుకోలేదు.. అందుకే నా సినిమా వాళ్లు చేయలేదు : వెంకీ అట్లూర

by sudharani |
Venky Atluri: తెలుగు స్టార్లు అడిగిందానికి నేను ఒప్పుకోలేదు.. అందుకే నా సినిమా వాళ్లు చేయలేదు : వెంకీ అట్లూర
X

దిశ, సినిమా: టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. అనతి క్రేజ్ మరింత పెరిగింది అనడంతో అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్.. ఆయన తీసిన ‘సార్’ (sir) సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘చాలా మంది పెద్ద హీరోలు ‘సార్’ మూవీ చేసేందుకు తిరస్కరించారు. ఎందుకంటే.. ఆ సినిమా క్లైమాక్స్‌ (Climax) వాళ్లకు నచ్చలేదు. అంతే కాకుండా.. కొందరు పాపులర్ తెలుగు యాక్టర్లు (Popular Telugu Actors) క్లైమాక్స్‌లో మార్పులు చేయాలని కోరారు. అయితే ఈ విషయంలో నేను రాజీపడలేదు. దీంతో వాళ్లు సినిమాకు సైన్ చేయలేదు. అప్పుడు ధనుష్ (Dhanush) దగ్గరకు వెళ్లి సినిమా కథ చెప్పాను. ఆయన కథ విని వెంటనే ఓకే చేయడంతో పాటు.. క్లైమాక్స్‌ని లైక్ చేశారు. దీంతో నేను కూడా షాక్ అయ్యా. అలా ‘సార్‌’ టీంలోకి ధనుష్‌ వచ్చారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతే కాకుండా.. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రం కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.

Advertisement

Next Story

Most Viewed