- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Subbu: ‘ఈ విషయాన్ని కథలో చాలా నిజాయితీగా చెప్పా’.. సినిమాపై హైప్ పెంచుతోన్న డైరెక్టర్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సుబ్బు మంగదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’(Bacchala Malli). టాలీవుడ్ సీనియర్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఆకట్టుకునే పోస్టర్లు, సాంగ్స్ విడుదల అయ్యాయి. బాలాజీ గుత్తా(Balaji Gutta), రాజేష్ దండా(Rajesh Danda) సంయుక్తంగా నిర్మిస్తోన్న బచ్చలమల్లి సినిమా ఈ నెల (డిసెంబరు) 20 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ హైదరాబాదులో మీడియా వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మంగదేవి మాట్లాడుతూ.. ప్రతి ఒకరి జీవితంలో తప్పు జరుగుతుందని.. కానీ ఆలస్యమైనా ఆ తప్పేంటో తెలుసుకోవాలన్నారు. లేకపోతే మీరే బాధపడాల్సి వస్తుందని.. వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని సిచ్యూవేషన్ వస్తుందని తెలిపారు. సరిదిద్దుకోలేని మిస్టేక్స్ చేయొద్దనే స్టోరీనే ఈ బచ్చలమల్లి చిత్రమని.. సినిమాలో ఈ విషయం చాలా నిజాయితీగా ప్రేక్షకులకు చూపించానని డైరెక్టర్ పేర్కొన్నారు. 90 ల్లో గ్రామంలో పెరిగానని.. కాగా ఆ రోజుల్లో ఎవరు ఎలా బిహేవ్ చేసేవారు తెలుసునని అన్నారు. లవ్ స్టోరీస్ కూడా ఎలా ఉండేవో తెలుసునని సుబ్బు చెప్పుకొచ్చారు.