- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘కన్నప్ప’ నుంచి బిగ్ అప్డేట్.. మాయాజాలం కోసం వేచి ఉండండంటూ విష్ణు ట్వీట్

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’(Kannappa) సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముకేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు(Mohan Babu), మంచు విష్ణు, అవ్రామ్, ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ సిద్ధం అవుతోంది.
ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా, మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా ‘కన్నప్ప’కు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మార్చి 10న లవ్ సాంగ్ రాబోతున్నట్లు తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ‘‘ప్రేమ, సంగీతం మాయాజాలం-మీ దారిలోకి వస్తున్నాయి! ఇది నా కెరీర్‌లోని అత్యంత ప్రత్యేకమైన ప్రేమ పాటలలో ఒకటి, మీరందరూ దీనిని అనుభవించే వరకు నేను వేచి ఉండలేను. మార్చి 10న విడుదల. నిజంగా మాయాజాలం కోసం వేచి ఉండండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మంచు విష్ణు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.