- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anushka Shetty: ప్రభాస్ సినిమాలో అనుష్క వేసుకున్న బికినీ గురించి తల్లి సంచలన కామెంట్స్?
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరోయిన్ అనుష్క క్రేజ్(Anushka Shetty) అంతా ఇంతా కాదు. అందం, నటన, డ్యాన్స్‌లోనే కాకుండా మంచితనానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నాగార్జున(Nagarjuna), రవితేజ(Ravi Teja), గోపిచంద్(Gopichand), ప్రభాస్(Prabhas) వంటి అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక బాహుబలి(Bahubali) సినిమాలో అనుష్క శెట్టి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదటి పార్ట్‌లో ప్రభాస్‌కు భార్యగా.. రెండో భాగంలో తల్లిగా నటించి.. జనాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. కానీ బాహుబలి చిత్రం తర్వాత స్వీటీ స్పీడ్ తగ్గించిందని చెప్పుకోవచ్చు. అరుంధతి(Arundhati) వంటి సినిమాలతో నట విశ్వరూపాన్ని చూపించిన ఈ బ్యూటీ ప్రజెంట్ ఘాటీ(Ghati) మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు క్రిష్(Krish) దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు కూడా వదులుతూ ఘాటీపై భారీ హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇకపోతే అనుష్క అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిల్లా(Billa) సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో స్వీటీ బికినీ మాదిరి డ్రెస్ ధరించింది. కాగా దీనిపై తన తల్లి ఎలా స్పందించిందో అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వాస్తవానికి అమ్మకు చాలా సంప్రదాయంగా ఉండటమంటేనే ఇష్టమని.. బిల్లా మూవీలో నన్ను ఆ డ్రెస్సింగ్‌లో చూసి ఏం అంటుందో అని కాస్త టెన్షన్‌గా ఫీల్ అయ్యానన తెలిపింది. కానీ అమ్మ కామెంట్స్ విన్నాక నిజంగా షాక్ అయ్యానని పేర్కొంది. ఇంకాస్త స్టైలిష్‌గా కనిపించొచ్చు కాదా.. సగం పద్ధతిగా, సగం మోడ్రన్‌గా ఆ డ్రెస్సులేంటని అనడంతో ఆశ్చర్యపోయానని నటి వెల్లడించింది. ప్రస్తుతం అనుష్క శెట్టి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.