- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్తుపల్లిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు...
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో స్థానిక జేవీఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మంగళవారం రాత్రి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో వాక్య ఉపదేశికులు విజయ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ భూలోకమునకు ఏసుక్రీస్తు పుట్టుక, లోక మానవాలికి కలిగే ఆనందం గూర్చి యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు వివరించారు.
అనంతరం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు అలవాల కరుణాకర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఎండీ కమల్ షాషా, వార్డు కౌన్సిలర్లు కంటే నాగలక్ష్మి, పింగళి సామ్యూల్, యేసు రత్నం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పలువురు పాస్టర్లు, క్రిస్టియన్ సోదర సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.