సెలైన్ పెట్టుకుని దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరో.. వైరల్‌గా మారిన పోస్ట్

by Hamsa |
సెలైన్ పెట్టుకుని దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరో.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: సుబ్బు మంగాదేవి(Subbu Mangadevi) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘బచ్చల మల్లి’(Bachchalamalli). ఇందులో అల్లరి నరేష్(Allari Naresh), అమృత అయ్యర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా(Rajesh Danda), బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. దీనికి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) సంగీతాన్ని సమకూర్చారు. అయితే ‘బచ్చలమల్లి’ చిత్రం డిసెంబర్ 20 థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ‘బచ్చలమల్లి’(Bachchalamalli) ట్రైలర్ డిసెంబర్ 14న రాబోతున్నట్లు తెలుపుతూ అల్లరి నరేష్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన సెలైన్ పెట్టుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు.

Advertisement

Next Story