- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడ్కోలు మిత్రమా… సినీ స్టార్స్ సంతాపం
భారత సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. రిషి కపూర్ మరణం కోట్లాది మంది అభిమానులను కంటతడి పెట్టించింది. ఈ చేదు వార్త జీర్ణించుకోలేక పోతున్న చింటు మిత్రులు… మా చింటు మాతో లేడన్న వార్త అబద్ధం అయితే ఎంత బాగుండు అని ఆశపడుతున్నారు. కానీ దేవుడు అంత అవకాశం ఇవ్వకుండా తన దగ్గరికి తీసుకెళ్లాడు అని దుఃఖిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా మిత్రుడి చివరి చూపుకు నోచుకోలేక సామాజిక మాధ్యమాల్లో సంతాపం తెలిపారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ జితేంద్ర .. రిషి కపూర్ మృతి నా జీవితంలో తీరని లోటని తెలిపారు. మంచి మిత్రుడు, సోదరుడు, మానవతా మూర్తిని కోల్పోవడం కలచివేస్తుందన్నారు. అంత గొప్ప వ్యక్తి జీవితంలో భాగం అయినందుకు గర్వపడుతున్నానన్న జితేంద్ర… కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Heartbroken … Rest In Peace … my dearest friend #RishiKapoor
— Rajinikanth (@rajinikanth) April 30, 2020
సూపర్ స్టార్ రజినీకాంత్ రిషి కపూర్ మరణవార్తతో గుండె పగిలిపోయిందని ట్వీట్ చేశాడు. నా ప్రియమైన మిత్రమా నువు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
Devastated to know Rishi Ji is no more. A great friend , A great artiste, heartthrob of millions. Carrier of a Great legacy. Feel so heartbroken at this loss. Farewell my friend #RishiKapoor. Rest in peace. pic.twitter.com/gBcdrIXvhO
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 30, 2020
రిషి కపూర్ ఇక లేరన్న వార్త కుంగదీసిందన్నారు చిరంజీవి. గొప్ప మిత్రుడు, గొప్ప కళాకారుడు, లక్షల మంది హృదయ స్పందన అయిన రిషి… గొప్ప వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. ఈ నష్టం హృదయ విదారకమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. వీడ్కోలు మిత్రమా…అంటూ నివాళులు అర్పించారు.
It seems like we’re in the midst of a nightmare…just heard the depressing news of #RishiKapoor ji passing away, it’s heartbreaking. He was a legend, a great co-star and a good friend of the family. My thoughts and prayers with his family 🙏🏻
— Akshay Kumar (@akshaykumar) April 30, 2020
రిషి కపూర్ మృతిని పీడకలగా అభివర్ణించారు అక్షయ్ కుమార్. ఒక లెజెండ్, గొప్ప సహ నటుడు, గొప్ప కుటుంబ స్నేహితుడిని కోల్పోవడం హృదయాన్ని ముక్కలు చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ కపూర్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
We have lost one of the greats today. An amazing actor, a wonderful human being, and 100% a child of Cinema.
Thank you for all the joy you brought to our lives.
Thank you for being the actor and human being that you were.
You will be badly missed Rishiji.
Love.
a.— Aamir Khan (@aamir_khan) April 30, 2020
ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని అన్నారు అమీర్ ఖాన్. అద్భుత నటుడు, అద్భుత మానవతావాది, సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అయిన రిషి కపూర్… మీరు నటుడుగా, మూర్తీభవించిన మానవతా వాదిగా … మా జీవితంలో ఆనందాలు తీసుకొచ్చిన మీకు ధన్యవాదాలు అని తెలిపారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నాం అంటూ ట్వీట్ చేశారు అమీర్ ఖాన్.
Tags : Rishi Kapoor, Chiranjeevi, Jitendra, Rajinikanth, Akshay Kumar, Aamir Khan