- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ
దిశ, ఏపీబ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో సినీ షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలంటూ సినీ పెద్దలు కాసేపట్లో సీఎం జగన్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో చిరంజీవి, నాగార్జున, త్రివిక్రమ్ శ్రీనివాస్, జీవిత తదితరులు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లకు హైదరాబాదుతో పాటు విశాఖపట్నం, కోనసీమ పల్లెలు, తలకోన అడవులు, అరకు అందాలు కీలక ప్రదేశాలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు తెలంగాణ సినిమాటోగఫ్రీ మంత్రి తలసాని శ్రీనివాస్‌తో సమావేశమై అక్కడ షూటింగ్‌లు ఆరంభించేందుకు అనుమతులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై ఆంక్షలు కొనసాగిస్తోంది. సినిమా షూటింగ్‌లకు జూనియర్ ఆర్టిస్టులతో పాటు సాంకేతిక వర్గం కీలకమైనది. ఈ నేపథ్యంలో షూటింగ్ జరగాలంటే పదుల సంఖ్యలో పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో షూటింగ్‌లకు సాంకేతిక అడ్డంకులు లేకుండా కొనసాగించేందుకు అనుమతుల కోసం సినీ ప్రముఖులు సీఎం జగన్‌ను కలువనుండగా, పరిశ్రమతో రాజకీయపరమైన అవసరాల నిమిత్తం అనుమతినిచ్చే అవకాశం ఉంది. అయితే థియేటర్లలో ప్రదర్శనకు మాత్రం ఇప్పటికిప్పుడు అవకాశమిచ్చే పరిస్థితి లేదు.