- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేంద్రీయ వ్యవసాయమే మేలు : అమల అక్కినేని
దిశ, రంగారెడ్డి:
సేంద్రీయ వ్యవసాయం (ఆర్గానిక్ ఫామింగ్) పై అపోహలు లేకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంటలు సాగు చేసే వ్యవసాయ పద్ధతులనేకం ఉన్నాయనీ వాటిని రైతులు అనుసరిస్తే మంచి లాభాలు గడించివచ్చునని ది బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కో ఫౌండర్, సినీనటి అమల అక్కినేని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట్ మండలం పాపిరెడ్డి గూడ సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని పేద రైతులకు కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆదాబ్ హైదరాబాద్ కథనం..మండల జెఫ్పీటీసీ తాండ్ర విశాల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమల రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సేంద్రీయ వ్యవసాయంపై పరస్పర అపనమ్మకాలను, అపోహలను పక్కన పెట్టి.. అనుభవాలను కలిసి పంచుకుంటే సేంద్రియ వ్యవసాయంలో వేగంగా మార్పు వస్తుందన్నారు. సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి ఉంటే నిపుణులు శాస్త్రవేత్తలని ఇక్కడికి రప్పించి రైతులకు అవసరం అయితే అవగాహన కల్పిస్తానన్నారు. సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి చొరవతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు అమల చెప్పుకొచ్చారు. అనంతరం సర్పంచ్ విష్ణు మాట్లాడుతూ..గ్రామంలోని 650 మంది రైతులకు ఒక్కొక్కరికి 4కిలోల చొప్పున కంది విత్తనాలు ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనా పెరుగుతున్న తరుణంలో అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలని.. ది బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ కో ఫౌండర్, సినీనటి అక్కినేని అమల ఆశిస్తున్నట్టు సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కరోనా వ్యాప్తి అరికట్టేందుకు అందరూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో ఆమెతో పాటు సుబ్బారావు, సుందరయ్య పాల్గొన్నారు.