- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనకాపల్లి 177/3డీలో ఏం జరిగింది..? రంగంలోకి సీఐడీ అధికారులు
by srinivas |
X
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని భూ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. బవులువాడలో 2.57 ఎకరాల ప్రభుత్వ భూమికి పాసుపుస్తకాలు మంజూరు చేయడం, ఆపై భూ స్వభావం మార్చారంటూ వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సర్వే నంబరు 177/3డీలో ప్రభుత్వ భూమికి ఈ ఏడాది మేలో అక్రమంగా పాసు పుస్తకాలు మంజూరు చేశారు రెవెన్యూ అధికారులు. అయితే దీనిపై వినియోగదారుల హక్కుల సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ సీఎం కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ బాధ్యతను సీఐడీ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఐడీ డీజీ ఆదేశాల మేరకు సీఐ పార్థసారధి నేతృత్వంలో ఈ దర్యాప్తు చేపడుతున్న అధికారులు తెలియజేశారు.
Advertisement
Next Story