- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఇల్లు కామెడీ షోకు ఏమాత్రం తీసిపోదు : బాలీవుడ్ నటుడు
దిశ, సినిమా: బీటౌన్ హీరోయిన్ అనన్య పాండే ఫాదర్, సీనియర్ నటుడు చుంకీ పాండే.. తమ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో రివీల్ చేశాడు. రెండేళ్ల కిందటి వరకు ఫ్యామిలీలో తనొక్కడే యాక్టర్ కాగా.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో కూతురు అనన్య పాండే కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనన్య ప్రస్తుతం తెలుగులో ‘లైగర్’తో పాటు హిందీలో మరో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, చుంకీ పాండే వైఫ్ భావన పాండే కూడా నెట్‌ఫ్లిక్స్ షో ‘ది ఫాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’తో రియాలిటీ స్టార్‌గా మారిపోయింది. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు సెలబ్రిటీలు ఉండటం వల్ల వారి మధ్య డిస్కషన్స్‌లో ఎలాంటి మార్పు వచ్చిందో మీడియాతో పంచుకున్నాడు చుంకీ పాండే.
‘నేను ఒక్కడినే యాక్టర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి చర్చ ఉండేది కాదు గానీ అనన్య స్టార్ అయ్యాక వర్క్ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇక భావన బాలీవుడ్ వైఫ్స్‌లో బిగ్ స్టార్ అయ్యాక అదే పెద్ద టాపిక్ అయిపోయింది. తను ఇప్పుడు రియాలిటీ వరల్డ్‌కు బాస్ గనుక తన పట్ల ప్రేమ, గౌరవాన్ని చూపెడతాం’ అన్నాడు. ఇల్లంతా ‘కామెడీ షో’ వాతావరణమే ఉంటుందని, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటామని వెల్లడించాడు. ఏవైనా సీరియస్ డిస్కషన్స్ లేదా ఆర్గ్యుమెంట్స్ ఉంటే వారానికి ఒకటి లేదా రెండుసార్లు 10 నిమిషాలు కేటాయిస్తామని చెప్పాడు.