మానవత్వాన్ని చాటుకున్న ఖాకీలు

by srinivas |
మానవత్వాన్ని చాటుకున్న ఖాకీలు
X

దిశ, అమరావతి బ్యూరో: కుమారుడికి కరోనా వైరస్‌ సోకిందనే మనోవ్యధతో గుండెపోటుకు గురై 68 ఏళ్ల వృద్ధుడు మరణించగా ఆ తర్వాత కొంతసేపటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు సైతం ప్రాణాలొదిలిన ఘటన చిత్తూరు జిల్లా నగరి ఏకాంబరకుప్పంలో చోటుచేసుకుంది. చుట్టుపక్కలే బంధువులున్నా కరోనా భయంతో కనీసం చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులే ముందుకొచ్చి వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. కో–ఆప్టెక్స్‌ సంస్థలో పనిచేసి రిటైరైన 68 ఏళ్ల వృద్ధుడు ఏకాంబర కుప్పంలో చిన్నపాటి జిరాక్స్‌ షాపు నడుపుకుంటూ షాపు పైభాగాన గల గదిలో ఒంటరిగా ఉంటున్నారు. అతని భార్య గతంలోనే మరణించగా కుమారుడు, కోడలు పక్క వీధిలో నివాసముంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేసే కుమారుడికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయం తెలిసి తండ్రి తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు.

Advertisement

Next Story

Most Viewed