- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిత్రపురిలో ఎన్నికల సందడి..
దిశ, వెబ్‌డెస్క్: చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఎన్నికలు నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం మూడు గంటలకు ముగియనుంది. ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానల్స్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్, సి.కళ్యాన్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’. వీటితో పాటు ఓ.కళ్యాణ్ ప్యానెల్, కొమర వెంకటేశ్ ప్యానెల్ కూడా బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల పోలింగ్ అనంతరం ఇవాళ సాయత్రమే ఫలితాలు వెలువనున్నాయి.
దీనిపై ఎన్నికల అధికారి అరుణ మాట్లాడుతూ.. చిత్రపురి కాలనీ ఎన్నికల్లో మొత్తం ఓట్ల సంఖ్య 4803 ఉన్నాయి. ఇప్పటి వరకు 850 ఓట్లు పోల్ అయ్యాయి. అంతేగాకుండా తాజాగా అగ్రదర్శకుడు వి. వినాయక్ తన ఓ హక్కు వినియోగింకున్నారు. ఇటీవల ఓ.కల్యాణ్ తన ప్యానెల్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ… ‘గత ముప్పై ఐదేళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. పలు అసోసియేషన్స్‌లో పనిచేశాను. ప్రతి చోట అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే వచ్చా. తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్‌బాలతో పాటు పదకొండు మందితో కూడిన కమిటీ చిత్రపురిలో అనేక అక్రమాలకు పాల్పడుతోంది.’’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.