చిరంజీవిని కుట్టిన తేనె టీగలు

by Shyam |
చిరంజీవిని కుట్టిన తేనె టీగలు
X

దిశ, నిజామాబాద్: సిని హీరో చిరంజీవి, అతని బంధువులను తేనె టీగలు కుట్టాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉమాపతి రావు అంత్యక్రియలు ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోటలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు సినీ నటుడు చిరంజీవి, రాంచరణ్ తేజ్, ఉపాసన, ఆమె కుటుంబ సభ్యులు కామినేని శోభన, అనిల్ కుమార్, ఇతరులు హాజరయ్యారు. ఉమాపతిరావు పార్థివ దేహాన్ని చితి వద్దకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు చెలరేగి వీరిని కుట్టాయి.

అదేవిధంగా.. జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దొత్రేలు ఉదయం ఉమాపతిరావు పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Advertisement

Next Story