ఉమెన్స్ డే రోజు కోర్టులో ఉన్నా..నా హక్కు కోసం పోరాడుతున్నా: చిన్మయి

by Jakkula Samataha |   ( Updated:2021-03-08 06:27:09.0  )
ఉమెన్స్ డే రోజు కోర్టులో ఉన్నా..నా హక్కు కోసం పోరాడుతున్నా: చిన్మయి
X

దిశ, సినిమా: ‘మీ టూ’ ఉద్యమం సమయంలో లిరిసిస్ట్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ గతంలో ఆరోపించింది చిన్మయి శ్రీపాద. సభ్యత్వ రుసుము చెల్లించలేదనే సాకుతో కావాలనే తనను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారంది. డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవి, వైరముత్తు కలిసి తనకు అన్యాయం చేశారని చిన్మయి గతంలో పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఉమెన్స్ డే రోజున తను కోర్టులో ఉన్నానని, తన హక్కును దక్కించుకునేందుకు పోరాటం కొనసాగిస్తున్నానని తెలిపింది.

బీజేపీ లీడర్, డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవి, అతని స్నేహితులు తనను ఎంత వేధించినా వెనుకడుగు వేయలేదని ట్వీట్ చేసింది. వైరముత్తు రాజకీయాల వల్ల రెండున్నర ఏళ్లుగా కేసు ముందుకు సాగడం లేదంది చిన్మయి. సినీ ఇండస్ట్రీలో ఐసీసీ(ఇంటర్నల్ కంప్లైయింట్స్ కమిటీ) ఎందుకు లేదని ప్రశ్నించింది. తను ఎంత స్పీడ్‌గా బ్యాన్ చేయబడ్డానో అంత స్పీడ్‌గా దర్యాప్తు ఎందుకు జరగడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

Advertisement

Next Story

Most Viewed