- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పేస్ వండర్ : ఆస్టరాయిడ్ దారి మళ్లించే రాకెట్స్
దిశ, ఫీచర్స్ : అంగారక గ్రహంలోని వాతావరణం, అక్కడి నేల, నీటి లభ్యతపై పరిశోధనలకు చైనా ప్రయోగించిన రోవర్ జూరోంగ్ గత మే నెలలో మార్స్‌పై కాలుమోపిన విషయం తెలిసిందే. ఇక అంగారక గ్రహంపై తీసిన కొత్త ఫోటోలను కూడా ఆ రోవర్ ఇటీవలే భూమిపైకి పంపించింది. ఈ క్రమంలోనే చైనా మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం చైనా పరిశోధకులు 20కి పైగా చైనా అతిపెద్ద రాకెట్లను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నారు. ఇవి భూమిని ఢీకొట్టే గ్రహశకలాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తోందని చైనా వివరిస్తోంది.
2021 చివరి నుంచి 2022 ఆరంభ కాలం వరకు భూమికి దగ్గరగా వస్తున్న రెండు గ్రహశకలాలు అడ్డగించడానికి అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా రోబోటిక్ అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. మన సౌర వ్యవస్థలోని గ్రహశకలాలను విచ్ఛిన్నం చేయడానికి చైనా ‘23 లాంగ్ మార్చి 5 (సిజడ్ -5)’ అనే భారీ రాకెట్లను ప్రయోగించనుంది. ఇందులో భాగంగా చైనా నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్‌లోని పరిశోధకులు కూడా సిమ్యులేషన్లు చేసి చూశారు. ‘23 లాంగ్ మార్చ్ 5’ అనే రాకెట్లతో వరుసగా ఢీకొట్టడం వల్ల ఓ పెద్ద ఆస్టరాయిడ్ తన దారి నుంచి భూవ్యాసం కంటే 1.4 రెట్లు ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉన్నట్లు ఈ సిమ్యులేషన్లలో గుర్తించారు. బెన్ను అనే ఓ భారీ ఆస్టరాయిడ్‌ను ఆధారంగా చేసుకుని అంచనా వేశారు. ఈ బెన్ను ఆస్టరాయిడ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత భారీగా ఉంటుంది. ఇలాంటి భారీ గ్రహశకలాల వల్ల భూప్రాంతానికి పెను ప్రమాదమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే అంతరిక్ష కేంద్రం మాడ్యూళ్లను పంపిణీ చేయడం నుంచి చంద్రుడు, అంగారక గ్రహానికి ప్రోబ్స్ పంపిచడం వరకు చైనా ఇప్పటికే విజయవంతంగా 2016 నుంచి ఆరు లాంగ్ మార్చి 5 రాకెట్లను వినియోగించుకుంది. ఇక ఇప్పుడీ రాకెట్లనే ఆస్టరాయిడ్ల దారి మళ్లించడానికి ఉపయోగించనుంది.
గ్రహశకలాల వల్ల ఎప్పుడూ ప్రమాదమే. అయితే కొన్ని గ్రహశకలాలు గులకరాళ్ళలాగా చిన్నవిగా ఉంటే, మరికొన్ని వందల కిలోమీటర్లు ఉంటాయి. 500 మీటర్లు (1,640 అడుగులు) వెడల్పు ఉన్న ఒక గ్రహశకలం లక్షలాది మందిని చంపగలదు. వీటిని దారి మళ్లించడం వల్ల భూప్రాంతాలను, జీవరాశులను కాపాడుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.