చైనా కంపెనీల హవాలా రాకెట్!

by Harish |   ( Updated:2020-08-12 06:26:22.0  )
చైనా కంపెనీల హవాలా రాకెట్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఓ వైపు చైనాపై తీవ్రమైన వ్యతిరేకత కొనసాగుతుంటే, ఇంకోవైపు చైనాకు చెందిన కంపెనీలకు సంబంధించిన భారీ హవాలా రాకెట్‌ (Money landering)ను ఆదాయపన్ను(Income tax) శాఖ అధికారులు ఛేదించారు. సుమారు రూ. 1000 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న చైనీయుల (Chaineese) పైనా, దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సంబంధిత భారత వ్యక్తులపైనా ఆదాయ పన్ను(ఐటీ) శాఖ సోదాలు జరిపింది.

షెల్ కంపెనీల( Shell companies) పేరుతో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలతో ఈ సోదాలు చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(Central board of direct taxes) పేర్కొంది. పలు బ్యాంకుల్లో 40కి పైగా ఖాతాల నుంచి హవాలా లావాదేవీలు జరిపినట్టు ప్రత్యక్ష పన్నుల బోర్డు అధికార ప్రతినిధి సురభి అహ్లువాలియా ( Surabhi ahluvaliya) ప్రకటనలో వెల్లడించారు. భారత్‌లోని రిటైల్ షోరూమ్‌ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి చైనా అనుబంధ కంపెనీల ద్వారా ప్రయత్నాలు సాగించినట్టు, నకిలీ కంపెనీలు స్థానిక భాగస్వాములతో రూ. 1000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్టు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో వీటికి సంబంధించిన పత్రాలను, యూఎస్ (Us), హాంకాంగ్ (Honkong) డాలర్లతో సంబంధమున్న విదేశీ హవాలా లావాదేవీల సాక్ష్యాలను సేకరించినట్టు ఐటీ విభాగం తెలిపింది. ఈ అక్రమాల్లో బ్యాంకులు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారం తీసుకున్నట్టు ఐటీ విభాగం వివరించింది. వరుస షెల్ కంపెనీల ద్వారా చైనాకు చెందిన వ్యక్తులు, వారి భారత వ్యక్తులు మనీలాండరింగ్, హవాలా లావాదేవీ (Transactions)లకు పాల్పడినట్టు ఐటీ శాఖకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈ కుంభకోణం (Scam) బయటపడింది.

Advertisement

Next Story

Most Viewed