- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కోరల్లో వాణిజ్యం!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ దెబ్బకు చైనాలో ఎగుమతులు దారుణంగా క్షీణించాయి. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఎగుమతులు రెట్టింపు వేగంతో దిగజారాయని గణాంకాలు చెబుతున్నాయి. దిగుమతులు సైతం చాలా తక్కువ గణాంకాలను నమోదు చేశాయి. ఎగుమతులు 17.2 శాతం క్షీణించి 292.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 7.8 శాతంతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. దిగుమతులు 4 శాతం క్షీణించి 299.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డిసెంబర్‌లో దిగుమతులు 16.3 శాతం అధికంగా ఉండేవి. జనవరిలో సంతకం చేసిన వాణిజ్య ఒప్పందంలో చైనా, అమెరికా మధ్య పన్నులను తొలగిస్తున్నట్టు సంతకాలు జరగడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది.
యూఎస్ ఎగుమతులు జనవరి, ఫిబ్రవరిలలో 27.7 శాతం క్షీణించి 43 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. డిసెంబర్‌లో ఎగుమతులు 12.5 శాతం తక్కువ నమోదయ్యాయి. ఇక అమెరికా వస్తువుల దిగుమతులు 2.5 శాతం పెరిగి 17.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే, చైనా ఇప్పటికే అమెరికాతో 25.4 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును కలిగి ఉంది.
ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 7.1 బిలియన్ డాలర్ల లోటుకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలోని తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా కోసం స్మార్ట్‌ఫోన్‌లు, బొమ్మలు, ఇతర వినియోగ వస్తువులను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి ముందుముందు తయారీ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ వరకూ పరిశ్రమలు సాధారణ ఉత్పత్తి స్థాయిని చేరుకునే అవకాశాల్లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకముందు వరకూ..సాంకేతికత, వాణిజ్య మిగులు వంటి అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పన్ను విషయంలో వాణిజ్య యుద్ధం జరిగింది. అయినప్పటికీ చైనా వాణిజ్యం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడింది. అంతకుముందు సంవత్సరం 2018తో పోలిస్తే గతేడాది ఎగుమతులు 0.5 శాతం పెరిగాయి. 2018 నుంచి ట్రంప్ ఎగుమతి వస్తువులపై సుంకాలను విధించిన తర్వాత ఆసియా, యూరప్, ఆఫ్రికాలోని ఇతర మార్కెట్లను మెరుగుపరచాలని చైనా ప్రభుత్వం ఎగుమతిదారులకు చెప్పింది. ఆ తర్వాత అమెరికా ప్రధాన ఎగుమతులైన సోయాబీన్స్, ఇతర వస్తువులపై పన్నులను పెంచడం ద్వారా చైనా ప్రతీకారం తీర్చుకుంది.
అయితే, జనవరిలో రెండు దేశాల మధ్య ఫేజ్-1 ఒప్పందం జరగడంతో పన్నులు సడలించారు. అదనపు సుంకాలను వాషింగ్టన్ రద్దు చేసింది. చైనా అమెరికా వ్యవసాయ ఎగుమతులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది.
అయితే, తర్వాతి పరిణామాల్లో వివాదాస్పదమైన యూఎస్-చైనా వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో సంధి చర్చలు విఫలమయ్యాయని ఆర్థిక వేత్తలు హెచ్చరించారు. చైనాలో నూతన సంవత్సరం సెలవుల సమయంలో రెండు లేదంటే అంతకంటే ఎక్కువ వారాలు పరిశ్రమలను, కర్మాగారాలను మూసివేస్తారు. అది కూడా వారి ఉద్యోగులు సొంత ఊర్ల నుంచి తిరిగొచ్చిన అనంతరమే తిరిగి ప్రారంభిస్తారు. సెలవులు ముగిసి కర్మాగారాలు తిరిగి ప్రారంభమయ్యాకే దిగుమతులు పెరుగుతాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అధికారులు ప్రయత్నిస్తున్న కారణంగా మునుపటి కంటే ఎక్కువ సెలవు రోజులను పొడిగించారు.
కరోనా ప్రభావం తక్కువగా వున్న ప్రాంతాల్లో స్థానిక అధికారులు ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి పరిశ్రమలను తిరిగి ప్రారంభించమని యజమానులను కోరుతున్నారు. అయినా సరే చాలామంది ముడి సరుకు అంశంలోనూ, తమ ఉద్యోగులను తిరిగి పనిలోకి రప్పించే విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే, ఉద్యోగులు ఎక్కువగా చాలా దూరం ప్రయాణాలు చేసి రావాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రాంతాల్లో ప్రయాణ నియంత్రణలు ఇంకా కొనసాగుతుండటంతో కుదరటంలేదని చెబుతున్నారు. చైనాలో ఎక్కువ భాగం పరిశ్రమలు మూతపడటంతో ఆసియా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టాలు మిగిలాయి. ఎందుకంటే, ఇక్కడి పరిశ్రమలకు ప్రపంచంలోని అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లు, బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్, వినియోగ వస్తువులను తయారుచేయడానికి ముడి పదార్థాల సరఫరా లేకపోవడమే. చైనా వ్యాప్తంగా షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్‌లు, ఇతర రిటైల్ వ్యాపారాలు అన్నీ మూతబడ్డాయి. ఈ పరిణామాలతో ఆన్‌లైన్ కిరాణ సరుకులను విక్రయించే వారికి డిమాండ్ పెరిగింది. కానీ, ఇతర వస్తువుల అమ్మకాలు మందగించాయి.
tags:China exports, China imports, DOnald Trump, US-China tariff war