షెడ్యూల్ ప్రకారమే వింటర్ ఒలింపిక్స్.. క్లారిటీ ఇచ్చిన చైనా

by Shyam |
షెడ్యూల్ ప్రకారమే వింటర్ ఒలింపిక్స్.. క్లారిటీ ఇచ్చిన చైనా
X

దిశ, స్పోర్ట్స్: బీజింగ్ వేదికగా జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్ 2022 షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జోయా లిజియాన్ స్పష్టం చేశారు. ఆఫ్రికా, ఆసియా దేశాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పలువురు వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్‌లో నిర్వహించనున్న ఈ ఒలింపిక్స్‌పై ఒమిక్రాన్ ప్రభావం పడుతుందని వ్యాఖ్యలు వినిపించాయి.

దీంతో చైనా తాజాగా వారి అనుమానాలపై స్పందించింది. ‘ఈ ఒలింపిక్స్ నిర్వహణ నిజంగా మాకు ఒక చాలెంజ్ లాంటిదే. ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదే. కానీ చైనా గతంలో కరోనా వైరస్‌ను సమర్దవంతంగా అదుపు చేసి నిర్మూలించింది. ఈ సారి కూడా ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కుంటాము. వింటర్ ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే సాఫీగా సాగిపోతాయి’ అని లిజియాన్ స్పష్టం చేశారు. ఈ సారి ఒలింపిక్స్‌కు విదేశీ ప్రేక్షకులను ఎవరినీ అనుమతించడం లేదని.. అథ్లెట్లు, సిబ్బంది అందరూ బయోబబుల్‌లో ఉంటారని చైనా స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed