జర్మనీ వ్యాక్సిన్‌కు అనుమతి యోచనలో చైనా

by Shamantha N |
జర్మనీ వ్యాక్సిన్‌కు అనుమతి యోచనలో చైనా
X

బీజింగ్: జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ ఎస్ఈ అనే కొవిడ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపే యోచనలో చైనా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒక వేళ ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే చైనాలో అనుమతి పొందిన మొదటి విదేశీ వ్యాక్సిన్‌గా బయోఎన్ టెక్ ఎస్ఈ గుర్తింపు పొందనుంది. వాల్ స్ట్రీట్ కథనం ప్రకారం.. వ్యాక్సిన్‌‌కు అనుమతులు మంజూరు చేసేందుకు వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్ డాటాను చైనా పరిశీలిస్తోంది. 10 వారాల్లోగా ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా వినియోగంలోకి తీసుకురావాలని చైనా యోచిస్తోంది. కాగా వ్యాక్సిన్ కోసం జర్మనీ ఔషద తయారీ సంస్థతో నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా, షాంఘై ఫో సన్ ఫార్మాస్యూటికల్స్ గ్రూపులు గతేడాది అగస్టులో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed