గాల్వన్ ఘటన.. చైనా ప్రణాళికనే: అమెరికా

by vinod kumar |
గాల్వన్ ఘటన.. చైనా ప్రణాళికనే: అమెరికా
X

న్యూఢిల్లీ: గాల్వన్ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పొరుగుదేశాలతో దుడుకు వైఖరి అవలంభించాలనే చైనా వ్యూహంలో భాగంగానే చోటుచేసుకుందని అమెరికా పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో లడాఖ్‌ సమీపంలోని చైనా సరిహద్దులో ఉభయ దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన చైనా ప్లాన్ ప్రకారమే జరిగిందని, కొన్ని మరణాలూ చోటుచేసుకునేలా చైనా అనుసరించిన వ్యూహమే కారణమని ఆధారాలు రుజువుచేస్తున్నాయని యూఎస్-చైనా ఎకనామిక్స్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన రిపోర్టులో వెల్లడించింది. మేనెలలో పలు ఘర్షణలు జరగడం మొదలై జూన్‌లో ఈ ఘటన సంభవించిందని పేర్కొంది. జపాన్ నుంచి ఇండియా వరకు మిలిటరీ, పారామిలిటరీ బలగాలతో అణచివేత ధోరణిని చైనా ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తున్నదని వివరించింది. ఇండియా-చైనా సరిహద్దులో సుస్థిరత్వానికి బలగాలు ఉపయోగించాలని చైనా రక్షణ మంత్రి సూచించిన తర్వాత గాల్వన్ ఘటన జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed