- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరస్ గురించి చైనాకు నవంబర్‌లోనే తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి విషయంలో చైనా నిర్లక్ష్యంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిడ్-19 గురించిన సమచారం ఎంతో ముందుగానే తెలిసినా కావాలనే ఆలస్యంగా ప్రపంచానికి చెప్పిందని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. చైనాకు కరోనా వైరస్‌కు సంబంధించిన విషయాలు నవంబర్‌లోనే తెలిసినా చాన్నాళ్లపాటు దాచి పెట్టిందని మండిపడ్డారు. డిసెంబర్ రెండో వారానికే వాళ్ల వద్ద పూర్తి సమాచారం ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వూహాన్‌లో తొలుత వెలుగులోనికి వచ్చిన సార్స్ కోవ్-2 అసలు నమూనాలుసహా వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమెరికా కోరుతోందని పాంపియో అన్నారు. కానీ, చైనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని తొలిసారిగా డిసెంబర్ 31న ప్రపంచానికి చెప్పిందని.. అప్పుడు కూడా దాని పేరేంటో చెప్పకుండా.. వింత లక్షణాలున్న న్యుమోనియా కేసులు వూహాన్‌లో నమోదవుతున్నట్లు తెలిపిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 4న దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. ఆ తర్వాతే పూర్తి సమాచారాన్ని ప్రపంచదేశాలతో పంచుకున్నారని పేర్కొన్నారు. అసలు నవంబర్‌లోనే వైరస్ గుర్తించినప్పుడు అప్పుడే సమాచారం ఎందుకు పంచుకోలేదు? తొలినాళ్లలో గుర్తించిన సమాచారం పంచుకుంటే దానిని ఎలా కట్టడి చేయాలో ప్రపంచ దేశాలకు అవగాహన వచ్చేది కదా అని పాంపియో ప్రశ్నించారు. ఈ విషయంలో చైనా, డబ్ల్యూహెచ్‌వో చాలా పెద్ద తప్పు చేశాయని.. ప్రపంచాన్ని హెచ్చరించడంలో కావాలనే నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టమని.. రాబోయే రోజుల్లో లోతైన దర్యప్తు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Tags: China only knew about the virus in November, coronavirus, china, covid19