అసెంబ్లీని దడదడలాడించిన పిల్లలు.. షాకైన సీఎం, మంత్రులు

by Anukaran |
అసెంబ్లీని దడదడలాడించిన పిల్లలు.. షాకైన సీఎం, మంత్రులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలంతా స్కూళ్లలో టీచర్లుగా, ప్రిన్సిపల్‌గా అవతారమెత్తి సందడి చేయడం చూశాం. మరికొన్ని చోట్ల జిల్లా పాలనాధికారి కలెక్టర్ బాధ్యతలను నిర్వహించడం కూడా చూశాం. కానీ, పిల్లల్లో ఉన్న నాయకత్వ లక్షణాన్ని, ప్రజల సమస్యలపై అవగాహనను తెలుసుకునేందుకు రాజకీయ నాయకులుగా అవతారమెత్తుతారని ఎప్పుడైనా అనుకున్నారా? ఇలాంటి సంఘటనే ఆదివారం రాజస్థాన్ అసెంబ్లీలో జరిగింది.

వివారాల్లోకి వెళితే.. పిల్లల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ ప్రభుత్వం కొందరు పిల్లలను ఎంపిక చేసి వారిలో నుంచి సీఎం, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షనాయకులుగా సభ నిర్వహించారు. అయితే, ఈ సభలో జరిగిన సంఘటనలు నాయకుల్ని ఆశ్చర్యపరిచాయి. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారని, ప్రజా ప్రతినిధులు, స్పీకర్ కోరగా.. ప్రతిపక్ష నాయకులు విద్యాసంస్థల వద్ద డ్రగ్స్ అమ్మకాలు, రైతు సమస్యలు, బాల్యవివాహాలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్న విద్యార్థులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ధర్నాకు దిగారు. మాదక ద్రవ్యాల అక్రమరవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు జరగవేమో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story