తొందరపడ్డ తల్లిదండ్రులు.. ఒంటరైన చిన్నారులు!

by srinivas |
suicide
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి సాధారణ, మధ్య తరగతి జీవితాల్లో కల్లోలం రేపుతోంది. కరోనా సోకిన తర్వాత కొందరు మంచి చికిత్స అనంతరం ధైర్యంగా బయట పడుతుంటే.. మరికొందరు కేవలం భయాందోళనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగురు రాష్ట్రాల్లో అధికంగా నమోదవుతున్నాయి.

తాజాగా విజయవాడలోని పెనగ ప్రాంతంలో కరోనా బారిన పడిన దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వలన వారి పిల్లలు అనాథలు అయ్యారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story