కరోనా చాటున బాల్యవివాహాలు

by Sampath |
కరోనా చాటున బాల్యవివాహాలు
X

దిశ, మహబూబాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచంను గడగడలాస్తుంది. ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నివారణకు చేస్తున్న మార్గాలు కొకల్లలు. కరోనా కాటుకు బలైన కుటుంబాలు ఎన్నో. వీధిన పడ్డ జీవితాలు మరెన్నో. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ పేద మధ్యతరగతి బాలికల పట్ల శాపంగా మారుతుంది. కరోనా దెబ్బకు విద్యాలయాలు మూసివేయడంతో బాలికలు ఇంటివద్దనే ఉంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తూ బాల్య వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లలను బాగా చదివిస్తే కూడా బాగా చదివిన వారికి ఇచ్చి పెళ్ళి చేయవలసి వస్తుందనే ఆలోచనలతో మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు.

సాంప్రదాయాలు కట్టుబాట్లు అని గిరిగీసుకుని కూర్చున్నా ..తల్లిదండ్రులకు ఇది కుంపటిగా మారింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒకవైపు… ప్రేమలో పడితే పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయనే ఉద్దేశం మరొకవైపు.. వీటిని మదిలో పెట్టుకొని 18 సంవత్సరాల లోపు బాలికలకు వివాహం జరిపించడం నేరమనే అవగాహన లేక తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ముందుడగు వేస్తున్నారు. తల్లిదండ్రులకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నా.. కొన్ని రహస్యంగా జరుగుతున్నాయి. వివాహాలు నిర్వహించడానికి గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, మండల స్థాయిలో తాసిల్దార్, ఐసిడిఎస్ సూపర్వైజర్, మున్సిపల్ కమిషనర్ ,డివిజన్ స్థాయిలో ఆర్డీవో ,జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ అదనపు కలెక్టర్ జిల్లా సంక్షేమ అధికారితో పాటు పలు శాఖల అధికారులు బాల్య వివాహ నిరోధక అధికారులుగా పనిచేస్తున్నారు. కరోనా మొదటి వేవ్ లో 116 బాల్యవివాహాలు, రెండవ విడత లో 60 బాల్యవివాహాలను చైల్డ్ లైన్ అధికారులు అడ్డుకున్నారు. దీనితో పాటు 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed