పీవీది 360డిగ్రీల పర్సనాలిటీ : సీఎం కేసీఆర్

by  |
పీవీది 360డిగ్రీల పర్సనాలిటీ : సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: వక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు అని, ఆయనది 360డిగ్రీల పర్సనాలిటీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఆయన ఘాట్ ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. పీవీ మన తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ అన్నారు. గెలుపోటముల్లో గంభీరంగా నిల్చున్న వ్యక్తి పీవీ అని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, ప్రపంచ దేశాలకు ఉత్తమ సందేశాన్ని పీవీ అందించారని అన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ అని తెలిపారు. నిరంతర విద్యార్థి అని, ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న తపన ఉండే వ్యక్తి అని, దేశంలోని అనేక భాషలు అవలీలగా మాట్లాడగలిగే ఘనుడు అన్నారు. విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చించి పీవీ అని తెలిపారు. పీవీ మన తెలంగాణ బిడ్డ కావడం మన అందరికీ గర్వకారణం అన్నారు. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించడం గొప్ప సంకల్పం అని, పీవీ బహుభాషా కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, సాహిత్యవేత్త, ఒక అద్భుతమైన వ్యక్తి అని వర్ణించారు. పీవీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలనుకునే వారు ఎవరైనా ఏ రాష్ర్టం వారైనా, ఏ పార్టీ వారైనా స్వేచ్చగా పాల్గొనవచ్చని, అందరికీ ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత భారత రాష్ర్టప్రతి, దేశ ప్రధాని, మాజీ ప్రధాని మన్మోహన్ లాంటి వాళ్లను కూడా ఈ ఉత్సవాల్లో పాలుపంచుకునేలాగా కూడా ప్రయత్నాలు చేస్తామన్నారు. పీవీ రాసిన రచనలు కూడా పున:ముద్రణ చేయాలని అధికారులను ఆదేశించారు. పీవీ పేరు మీద ఒక మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లుక్ టు ఈస్ట్ నినాదాన్ని వినిపించిన వ్యక్తి, 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన మహోన్నత వ్యక్తి పీవీ అన్నారు. మనం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛకు ప్రధాన కారకులు, వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక పీవీ అని కేసీఆర్ అన్నారు. పీవీ దక్కాల్సిన అన్ని గౌరవాలను దక్కే విధంగా కృష్టి చేస్తామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed