క్షమాపణలు కోరిన ముఖ్యమంత్రి

by Shamantha N |
క్షమాపణలు కోరిన ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేడుకున్నారు. ముంబైలో ఈరోజు ఉదయం కొవిడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది మృతి చెందారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అలానే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూనే క్షమాపణలు వేడుకుంటున్నాను.” అని ఉద్థవ్ పేర్కొన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వెంటిలేటర్‌పై ఉన్నవారే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed