ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?

by Shamantha N |
ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ పొడిగింపు.. ఎప్పటివరకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. వైరస్ నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రస్తుతం లాక్‌డౌన్ ఒక్కటే నివారణ మార్గంగా కనిపిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ తీసుకొస్తుండడంతో వైరస్ మరింతగా పెరుగుతోందన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు.

అయితే, కరోనా నివారణ పై సోమవారం ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ కేబినెట్ సమావేశం అయింది. గత వారం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను. మరోసారి పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆరు నగరాల్లో కరోనా వ్యాప్తి ఉన్నందున ఆగస్టు 6వ తేది వరకు లాక్‌డౌన్ పొడిగించారు.

కేబినెట్ సమావేశం అనంతరం ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి రవీంద్ర చౌబే మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నామని.. దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే, ఆగస్టు 6 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కఠిన నిబంధనలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటి వరకు ఆదివారం రాత్రి వరకు 7,623 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 4,944 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,626 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 43 మంది వైరస్‌తో మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed