Anandayya : ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు

by srinivas |   ( Updated:2021-05-26 03:10:49.0  )
Anandayya : ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందు ( Krishnapatnam Anandaiah Medicine) పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తుడా ఛైర్మన్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలోని మంగాపురం వద్ద యానిమల్ ల్యాబ్‌లో జంతువులపై ఆనందయ్య మందు పరిశోధన జరుగుతుందని, 14 రోజుల్లో నివేదిక వస్తుందన్నారు. 4 దశల్లో ట్రయల్స్ నిర్వహించి, ప్రభుత్వం నివేదిక ఆధారంగా మందుని సరఫరా చేస్తామన్నారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆనందయ్య బంధువులతో కలిసి మందు తయారీ అవకాశాలను చెవిరెడ్డి పరిశీలించారు.

కేంద్రం అనుమతిస్తే మందు తయారీకి సిద్ధంగా ఉన్నామని, అనుమతులు వచ్చిన వారం రోజుల్లోనే టీటీడీ ఆధ్వర్యంలో మందు సరఫరా చేస్తామన్నారు.

Advertisement

Next Story