- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'చదువుకుంటే కొలువులు రావాయే.. పంట పండిస్తే కొనేటోళ్లు లేరాయే'
దిశ, దుబ్బాక: రైతు ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు కనిపిస్తోందని దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడంలేదని రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని కేంద్ర ప్రభుత్వం ఇలా ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేతగాని పాలన ఎందుకు చేస్తున్నారని విమర్శించారు.
దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం వస్తదని, సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కినంక చేతులు దులపారని టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు ప్రతి గింజ కొంటామని ఐకేపీ సెంటర్ లు ఓపెన్ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగల్భాలు పలికి ఇప్పుడు కేంద్రం కొనట్లేదనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు చూస్తే అమాయక ప్రజలను మోసం చేయడం తప్ప మరేం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వడ్లు కొనేలా చర్యలు తీసుకుంటూ రైతులకు వ్యతిరేకంగా ఉన్న రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, రైతులకు న్యాయం జరిగే వరకు దుబ్బాక నుంచి రైతులతో కలిసి రైతు పోరు యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల శ్రీనివాస్, ఏసు రెడ్డి, వెంకటస్వామి, భూపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.