- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పట్లో ఐపీఎల్ బాగా జరిగేది : మురళీధరన్
దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఐపీఎల్‌లో ఆడాలని తాను గట్టిగా మొక్కుకున్నట్లు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. జట్టులో ఎక్కువ మంది చెన్నై వాళ్లు ఉంటారని, తాను చెన్నై అల్లుడినే కాబట్టి స్థానికులతో చక్కగా కలసిపోవచ్చని భావించినట్లు మురళీధరన్ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభ దశలో స్థానిక క్రికెటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉండేది. అది చాలా మంచి నిర్ణయమని మురళీధరన్ అన్నాడు. తొలి మూడు సీజన్లు ఐపీఎల్ చాలా బాగా సాగిందని, జట్టులో 7 నుంచి 8 మంది క్రికెటర్లు స్థానిక భాష(తమిళం)లోనే మాట్లాడుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని మురళీ పేర్కొన్నాడు. నేను ఐపీఎల్‌లో ఆడిన జట్లలో చెన్నై సూపర్ కింగ్సే అత్యుత్తమ జట్టని కితాబిచ్చాడు. ఏ ఆటలోనైనా మానసిక స్థైర్యం, వ్యూహాల అమలు వంటి విషయాలే 90శాతం ఉంటాయని, మిగిలిన 10శాతం మనం ఆడే ఆట అని మురళి చెప్పాడు. కానీ, ఈతరం ఆటగాళ్లు మానసిక స్థైర్యం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఆట మీదే దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి విఫలం కాగానే తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు. మానసిక ఒత్తిడిని భరించలేక ఎంతో మంది నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు అర్ధాంతరంగా తమ కెరీర్ ముగించినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.