సినీ గాయనీ పేరుతో మోసం

by Sumithra |
సినీ గాయనీ పేరుతో మోసం
X

దిశ, క్రైమ్ బ్యూరో: సోషల్ మీడియాలో ప్రముఖ తెలుగు సినీ గాయనీ పేరుతో ఫేక్ అకౌంట్లను సృష్టించి, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అగంతకున్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన చైతన్య అలియాస్ చైతు అనంతపూర్ లోని ప్రియాంక నగర్ నివాసి ఉంటున్నాడు. తెలుగు సినిమాలో పాటలు పాడి, భవిష్యతులో ప్రజాధరణ పొందాలను భావించాడు. ఈ క్రమంలో కొన్ని తెలుగు పాటలను రికార్డు చేసి.. యూట్యూబ్ లోని ఓ ఛానల్ లో అప్ లోడ్ చేశాడు.

అయితే చైతన్య ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో ప్రసిద్ద ప్లే బ్యాక్ సింగర్ పేరును ఉపయోగించుకోవాలనుకున్నాడు. దీని ద్వారా సినీ పరిశ్రమలో సులువుగా, తొందరగా గుర్తింపు తెచ్చుకోవచ్చని భావించాడు. దీంతో సదరు గాయనీ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు అకౌంట్లను సృష్టించాడు. సదరు గాయనీకి మేనేజర్ గా పేర్కొంటూ ఆమె ఇమేజ్ కు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టాడు. అంతే కాకుండా, ఆమె పేరుతో 2020 ఫిబ్రవరిలో అనంతపూర్ జిల్లా సమీపంలోని సనాపా గ్రామంలో ఈవెంట్ నిర్వహించినట్టుగా సంబంధిత గాయనీకి తెలిసింది. ఆమెతో కుటుంబం సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు ప్రచారం ప్రారంభించాడు.

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించి, అమాయక పౌరులను తన పేరుతో మోసం చేస్తున్న సదరు వ్యక్తికిపై చర్యలు తీసుకోవాలని ఆ గాయనీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం నిందితుడు చైతన్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడికి గతంలో అనంతపూర్ జిల్లా బుక్కరాయసముద్రం, ఆత్మకూర్, అనంతపూర్ త్రీ టౌన్, ఐవీ టౌన్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదు అయినట్టుగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed