- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఐ కాంట్ బ్రీత్': మేఘన్ పై ఎలిజబెత్ ఎక్కి తొక్కుతూ ఇలా
దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సెన్సేషన్ ఫ్రెంచ్ మేగజీన్ చార్లీ హెబ్డో మరోసారి తన మార్క్ కార్టూన్స్ తో నిప్పు రాజేసి చలి కాల్చుకుంటుంది. 2015లో మేగజీన్ చార్లీ హెబ్డో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిపింది. ప్రవక్త బొమ్మలు వేయడం ఇస్లాం మతంలో నిషిద్ధం. కానీ చార్జీ హెబ్డో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్లను ప్రచురించింది. దీంతో సదరు మేగజీన్ కు వ్యతిరేకంగా అగంతకులు తుపాకులు, ఇతర ఆయుధాలతో దాడులు చేశారు. ఆ ఘటనలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ప్రముఖ కార్టూనిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే తరహాలో బ్రిటన్ యువరాజు హ్యారీ ఆయన భార్య అమెరికన్ నటి మేఘన్ మార్కెల్‌ల గురించి కార్టూన్స్ ను ప్రచురించి. ప్రస్తుతం ఆ కార్టూన్ బ్రిటన్ తో పాటూ అమెరికాలో పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారాయి.
ఇటీవల బ్రిటన్ రాజదంపతులు హ్యారీ, మేఘన్‌లు బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అమెరికాకు వెళ్లి ఓప్రా విన్ ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సందర్భంగా మేఘన్ మాట్లాడుతూ రాజకుటుంబంలో ఉండడం చాలా కష్టమైందని తెలిపారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ లో ఉన్న సమయంలో చాలాసార్లు అవమానానికి గురైనట్లు, అది తట్టుకోలేక ఒక్కోదశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనను చుట్టుముట్టాయని మేఘన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు తమకు పుట్టబోయే బిడ్డ ముదురు రంగులో జన్మిస్తాడేమోనన్న రాజకుటుంబీకులు ఆందోళనపడిన విజయం గురించి తెలిసి బాధపడినట్లు వివరించారు. దీనిపై ఫ్రెంచ్ మేగజీన్ చార్లీ హెబ్డో.., బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
2020 మే 25వ తేదీన అమెరికాకు చెందిన డెరెక్ చౌవిన్ అనే పోలీస్ అధికారి అనుమానంతో ఆ దేశ నల్ల జాతీయుడైన జార్జిఫ్లాయిడ్‌ను కిందపడేసి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో నొక్కి ఉంచడంతో ఊపిరాడక చనిపోయాడు. పోలీసు అధికారి మెడపై మోకాలు పెట్టిన సమయంలో.. ‘ఐ కాంట్ బ్రీత్’ ఊపిరి తీసుకోలేకపోతున్నానని ఫ్లాయిడ్ వేడుకున్నాడు. కానీ పోలీస్ అధికారి చౌవిన్ కనికరించలేదు. దీంతో అతను చనిపోయాడు.
తాజాగా ఫ్లాయిడ్ మరణాన్ని ప్రస్తావిస్తూ చార్లీ హెబ్డో కార్టూన్ ను ప్రచురించింది. ఆ కార్టూన్ లో మేఘన్ ఇటీవల ఓప్రా విన్ ఫ్రేకు ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా పోలీసులు నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ఎలాగైతే మోకాలితో నొక్కారో అలాగే బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ .. మేఘన్ పై తన మొకాలితో నొక్కుతున్నట్లు అర్ధం వచ్చేలా డిజైన్ చేసింది. మేఘన్ పై ఉన్న ఎలిజబెత్ బకింగ్ హోమ్ ప్యాలెస్ వదిలేసి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తుంటే…, ఎలిజబెత్ ప్రశ్నకు మేఘన్ తన సమాధానంగా ‘ఐ కాంట్ బ్రీత్’ అని అంటుందని చార్లీ హెబ్డో కార్టూన్ తో ప్రజెంట్ చేసింది.