- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LAC వద్ద మార్పులు సహించం : ఆర్మీ
దిశ, వెబ్ డెస్క్ : ఇండో- చైనా సరిహద్దు(LAC) వెంబడి మార్పులు సహించేది లేదని.. యధాతథస్థితిని కొనసాగించాల్సిందేనని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. అప్పటివరకు కుగ్రంగ్ నది ప్రాంతాల నుంచి బలగాలు వైదొలిగేది లేదని కుండబద్దలుగొట్టింది. ప్రస్తుతం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) పాంగాంగ్ ట్సో, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ అతిక్రమణ ప్రదేశాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తోంది. ఈ మేరకు సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
సీనియర్ మిలిటరీ కమాండర్ కథనం ప్రకారం.. లడఖ్, ఆక్రమిత ఆక్సాయ్ చిన్ ప్రాంతాల్లో (PLA) గగనతల కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేకపోయినప్పటికీ, లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ పెద్ద సంఖ్యలో మొహరించింది. కొద్దికొద్దిగా భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు కనిపించినా అది వాస్తవం కాదు. అతిక్రమణలను చొరబాట్లుగా మార్చేందుకు పీఎల్ఏ కుట్ర పన్నుతోంది. వాటిని భగ్నం చేయాలని ఆర్మీకి ఆదేశాలు వెళ్లాయి.
లడఖ్ సెక్టార్‌లో గడచిన మే నెలలో పీఎల్ఏ అతిక్రమణలకు చైనీస్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అనుమతి ఉన్నట్లు జాతీయ భద్రతా ప్రణాళిక వ్యూహకర్తలు నిర్దారించారు. (CMC) జనరల్ సెక్రటరీగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయులలో గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, చైనా మన ముందుంచిన డిమాండ్లను భారత్ అంగీకరించడం లేదు. అవేంటంటే.. పాంగాంగ్ ట్సో నుంచి మన పాత అడ్మినిస్ట్రేటివ్ బేస్‌ను తొలగించాలని, కుగ్రంగ్ నది అంచుల్లోని సైన్యాన్ని ఉపసంహరించాలని చైనా కోరుతోంది. ఇందుకు భారత్ ఖరాఖండీగా నో చెప్పింది. అయితే, చైనా దళాలు తప్పనిసరిగా వెనక్కి వెళ్లాల్సిందేనని, (LAC) వద్ద ఎలాంటి మార్పులు అంగీకరించేది లేదని మరోసారి స్పష్టంచేసింది.