Automobile: ధరలు పెంపు ప్రకటించిన బీఎండబ్ల్యూ, రెనాల్ట్

by S Gopi |
Automobile: ధరలు పెంపు ప్రకటించిన బీఎండబ్ల్యూ, రెనాల్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ కంపెనీలు వచ్చే నెల నుంచి వినియోగదారులపై ధరల భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ మారుతీ సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ కార్ల ధరలను పెంచగా, గురువారం లగ్జరీ కార్ల బ్రాండ్ బీఎండబ్ల్యూతో పాటు రెనాల్ట్ సైతం తన అన్ని కార్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ నుంచి తన కార్ల ధరలపై 3 శాతం పెంపు నిర్ణయం తీసుకున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా తెలిపింది. దీంతో కంపెనీ ఈ ఏడాదిలో రెండోసారి పెంపు నిర్ణయం తీసుకున్నట్టు అయింది. జనవరిలో బీఎండబ్ల్యూ తన కార్ల ధరలను సవరించింది. మరో కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ ఇండియా కూడా కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచుతామని, ఈ పెరుగుదల 2 శాతం మేర ఉంటుందని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 2023, ఫిబ్రవరి తర్వాత రెనాల్ట్ ఇండియా తొలిసారి కార్ల ధరలు పెంచడం విశేషం. మోడల్, వేరియంట్‌ల ఆధారంగా ఈ పెంపు ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగానే వాహన పరిశ్రమలో కంపెనీలు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి.

Next Story

Most Viewed