వారిని చూసి నవ్వాలో జాలిపడాలో అర్ధం కావడం లేదు

by Sridhar Babu |
వారిని చూసి నవ్వాలో  జాలిపడాలో అర్ధం కావడం లేదు
X

దిశ, లింగాలఘణపురం/ రఘునాథుపల్లి/ చిల్పూర్ : బడ్జెట్ లో 6 గ్యారంటీలకు రూ.56 వేల కోట్ల నిధులు కేటాయించినా కొంతమంది అమాయకులు చేయ లేదంటున్నారని, అలాంటి వారిని చూసి నవ్వాలో జాలిపడాలో అర్ధం కావడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం పలు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కి ముఖ్య అతిథిగా హాజరై లింగాల ఘణపురంలో 39 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 43 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, రఘునాథపల్లిలో 32 మంది కల్యాణలక్ష్మి, 40 మందికి సీఎం సహాయ నిధి, చిల్పూర్ లో 49 మందికి కళ్యాణ లక్ష్మి, 49 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా 3 లక్షల 4 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ తయారు చేసిందని అన్నారు. అందులో సాగునీటి రంగానికి 23 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

పెండింగ్ ప్రాజెక్టులు, కాలువలను పూర్తిచేసి ప్రజలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పెండింగ్ లో ఉన్న దేవాదుల పనులు పూర్తిచేసి సంవత్సరంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 1500 ఇండ్లు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. దీంతో నియోజకవర్గంలో 5,000 మంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నిజమైన లబ్ధిదార్లకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని స్పష్టం చేశారు.

దేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ఆడ పిల్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక భారం పడకుండా వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వాన్నివిమర్శించే ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం ఆర్డీఓ గోపి రామ్, తహసీల్దార్ లు రవీందర్, మూషిన్ ముస్తఫా, సరస్వతి, ఎంపీడీఓలు జలంధర్ రెడ్డి, శ్రీనివాస్, శంకర్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, స్టేషన్​ఘన్​న్పూర్ మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, జీడికల్ దేవస్థానం చైర్మన్ ఏలమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవి, మాజీ జెడ్పీటీసీలు గుడి వంశీధర్ రెడ్డి, బొల్లంఅజయ్, నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, దూసరి గణపతి, వేముల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిటుకుల వెంకటేశ్వర్లు, దిలీప్ రెడ్డి, ఆంజనేయులు, యువజన నాయకులు సంపత్, అబ్బాస్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed