- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థుల దృష్టి లోప సమస్యలకు మెరుగైన చికిత్స

దిశ, సంగారెడ్డి : విద్యార్థులలో కంటి చూపు లోపాలని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం సంగారెడ్డి శాంతినగర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బీఎస్ కే కార్యక్రమం కింద దృష్టి లోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు నిర్ణీత లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని అన్నారు. విద్యార్థులు మొబైల్, ట్యాబ్, కంప్యూటర్, టివి వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై ఎక్కువ సమయం కేటాయించడంతో విద్యార్థులలో కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వాటి నివారణకు జిల్లాలో సంవత్సరం 2024 లో రెసిడెన్షియల్ హాస్టల్స్ , ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 9 టీం ల ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పిల్లలను కంటి పరీక్షలు చేపట్టి దృష్టి లోపాన్ని గుర్తించి నాణ్యమైన కంటి అద్దాలను అందిస్తున్నామని పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి సారించి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.
జిల్లాలో అన్ని పాఠశాల లో దృష్టిలోపం ఉన్న 4792 మంది విద్యార్థులు మొదటి దశ స్క్రీనింగ్ తర్వాత దృష్టి లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. వీరిని కంటి వైద్యులు పరిశీలించగా వీరిలో 4396 విద్యార్థులకు కంటి అద్దాల అవసరమవుతాయని నిర్ణయించినట్లు తెలిపారు. కంటి అద్దాల అవసరం ఉన్న వారందరికీ ఈ రోజు అన్ని పాఠశాలల్లో 4396 మంది విద్యార్థులకు కండ్ల అద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మిగిలిన విద్యార్థులకు కూడా కండ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. దృష్టిలోపం సమస్యను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా వరకు సమస్య మెరుగు పడుతుందన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు చదువుపై దృష్టి సాధించి మంచి మార్కులతో ఉత్తర్వులు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని జ్యోతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.