ట్యాంక్ ఎక్కి దళిత సంఘం నేతలు హల్​చల్​

by Sridhar Babu |
ట్యాంక్ ఎక్కి దళిత సంఘం నేతలు హల్​చల్​
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని మోడల్ స్కూల్ (బొందబడి) పరిసరాల్లోని నీళ్ల ట్యాంక్ పైకి దళిత సంఘ నాయకులు ఎక్కారు. సర్వే నెంబర్ 121 లో గల ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మార్వో, ఆర్డీఓ సైతం ఘటనాస్థలికి చేరుకున్నారు. వారిని సర్దిపుచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ దళిత సంఘాల నాయకులు ససేమిరా అన్నారు. అక్రమ నిర్మాణాలు రాత్రివేళ చేపడుతున్నట్లు ఆరోపించారు. అక్రమ కట్టడాలను తక్షణమే ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం ఆర్డీఓ ఫోన్ కాల్ లో ట్యాంక్ పై ఉన్నవారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వీరస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు సదరు అక్రమ కట్టడాల ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణంగా భావిస్తున్న వ్యక్తులు తమకు డాక్యుమెంట్స్ ఉన్నట్లు ఆరోపించారు. అధికారుల పనులకు అడ్డు తగిలారు. ఎస్సై, సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. అడ్డుతగిలిన వారిని వారించే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో పిల్లర్లను తొలగించారు. సదరు వ్యక్తులు పలు పత్రాలు ఎమ్మార్వోకు చూపెట్టడంతో తొలగింపు పనులు నిలిపివేశారు. అనుమతి తీసుకునే వరకు పనులు చేపట్టవద్దని సూచించారు.

Next Story