- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జిల్లాలో తీవ్ర కలకలం.. సగం కాలిపోయిన శవం లభ్యం

దిశ, తిరుపతి రూరల్: మానవత్వం మంట కలిసి పోయింది. ఒక వ్యక్తిని దారుణ హత్య చేసి నామరూపాలు లేకుండా చేసిన ఘటన తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్, వేదాంతపురం గ్రామపంచాయతీ పరిధిలో దారుణం జరిగింది. రహదారికి సమీపంలో సగం కాలిపోయిన శవం తీవ్ర కలకలం రేపింది. చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. 19వ తేదీ అర్ధరాత్రి మన భీమవరం రుచులు సమీపంలో పూతలపట్టు నాయుడుపేట రహదారి దగ్గరగా ఒక వ్యక్తిని వేరొక చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని అన్నారు.
శవం ఆనవాళ్లు సైతం దొరక్కుండా యాసిడ్ తో గాని పెట్రోల్ తో గాని కాల్చడానికి ప్రయత్నించి ఉండొచ్చని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టామని డాగ్ స్క్వాడ్ టీం క్రైమ్ క్లూస్ టీం సైతం రంగంలోకి దిగాయని త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని అన్నారు. ఈ దర్యాప్తులో తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ ఎస్సైలు సాయినాథ్ చౌదరి, అరుణ సైతం పాల్గొన్నారు.