ప్రమాదకరంగా రోడ్లు.. విద్యార్థులకు తప్పని తిప్పలు

by Sridhar Babu |   ( Updated:2021-09-29 04:59:29.0  )
ప్రమాదకరంగా రోడ్లు.. విద్యార్థులకు తప్పని తిప్పలు
X

దిశ, చండూర్ : రోడ్లు బాగా లేకపోవడంతో నేర్మట గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. నేర్మట నుంచి చండూరు వెళ్లాలంటే ఆటో, బస్సు సౌకర్యం ఉంటనే వెళ్లగలం. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు ప్రమాదకరంగా మారాయి. దీంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఎప్పుడు రోడ్డు కూలి పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు బాగు చేయాలని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ ఇంతవరకు రోడ్డు పనులు చేపట్టకపోవడం శోచనీయం.

ఈ మధ్యన పత్రికలో వచ్చిన వార్తలు చూసి, జిల్లా పంచాయతీ అధికారులు, త్వరగా పని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు బాగు చేయకపోవడం ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో విద్యార్థుల కోసం నల్లగొండ డిపో నుండి ఒక బస్సు వచ్చేది. కానీ, కరోనా కారణంగా ఆ బస్సు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టి, విద్యార్థులకు బస్సు సౌకర్యం వచ్చే విధంగా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed