- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలవరంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఫైట్
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పోలవరం టెండర్లు టీడీపీ హయాంలో జరగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. 2013 ముగిసే నాటికి టెండర్లు వచ్చాయని.. పోలవరం విషయంలో ఎక్కడా రాజీపడలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుపై వైసీపీ కాంట్రవర్సీ చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
దీనిపై మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పోలవరంపై కాంట్రవర్సీ చేసింది టీడీపీ సభ్యులు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఆరోపించింది మీరు కాదా అని నిలదీశారు. ప్రాజెక్టు ఎత్తు మిల్లీమీటర్ కూడా తగ్గించబోమన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఏనాడూ ప్రాజెక్టును పట్టించుకోలేదని అనిల్ కుమార్ విమర్శించారు. చంద్రబాబు కేంద్ర ప్యాకేజీ కోసం 2017 లో 2014 రేట్లకే నిర్మించేందుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.