- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెజవాడలో రసవత్తరంగా రాజకీయం.. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్..
దిశ, వెబ్‌డెస్క్ : బెడవాడలో పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్నాయి. వంగవీటి రాధాపై హత్యకు జరిగిన కుట్ర, రెక్కీ అంశం కీలక మలుపు తిరిగింది. రాధాపై రెక్కీ చేసింది వైసీపీ కార్పొరేటర్ ఆరవ సత్యనారాయణ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆరవ సత్యం దిష్టిబొమ్మను వంగవీటి అనుచరులు దగ్ధం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రజల్లో తిరిగే తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని రాధా పంపించివేశారు.
దీంతో బెజవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. జరుగుతున్న పరిణామాలపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. డీజీపీకి లేఖ రాశారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని ఆరోపించారు. రాధాపై రెక్కీ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. అనంతరం రాధాకు ఫోన్ చేసిన చంద్రబాబు.. పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.