- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయితేజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : చంద్రబాబు నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: దేశ సేవ చేస్తూ అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎర్రబల్లి పంచాయతీకి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. లాన్స్ నాయక్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజకు టీడీపీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో పుట్టి పెరిగి సాధారణ సైనికుడిగా ఎంపికై కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో ఏకంగా త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శం. గిరిజన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్ని విధాలా ఆదుకోవాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలో సీఎస్ సమీర్ శర్మకు విజ్ఞప్తి చేశారు.