సోషల్ మీడియాలో పోస్టుతో ఆకట్టుకుంటున్న బాబు

by srinivas |
TDP
X

సామాజిక అంశాలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వేగంగా స్పందిస్తారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు సమాజంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా స్పందిస్తారు. వైజాగ్‌ను అతలాకుతలం చేసిన హుదూద్ అయినా శ్రీకాకుళాన్ని కబలించిన తిత్లీ తుపానైనా బాబు వేగంగా స్పందిస్తారు. ప్రపంచాన్ని కరోనా భయపెడుతున్న వేళ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఫోటో పోస్టు చేసి, వ్యాఖ్యను జోడించారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దాని వివరాల్లోకి వెళ్తే..

ఆ ఫొటోలో అగ్గిపుల్లలు ఒకదానిపక్కన ఒకటి ఉన్నాయి. దీంతో మొదటి అగ్గిపుల్లకు మంట అంటుకోగానే రెండో దానికి, దాని నుంచి మూడో దానికి ఇలా అన్నింటికీ అగ్ని అంటుకుంటుంది. అయితే, మధ్యలో ఒక అగ్గిపుల్ల దూరంగా జరుగుతుంది. దీంతో దానికి అగ్ని అంటుకోదు.. దీంతో దాని తర్వాత ఉన్న అగ్గిపుల్లలకు కూడా మంట అంటుకోదు.

కరోనా వ్యాప్తిస్తోన్న తరుణంలో ఈ వర్ణన ప్రస్తుత పరిస్థితులకు అద్భుతంగా పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో సమాజంలో ప్రజలకు దూరంగా ఉండడం వల్ల మనల్ని మనం కరోనా బారినుంచి కాపాడుకోవడంతో పాటు ఇతరులను రక్షించవచ్చని తెలిపారు. ఈ కరోనా మహమ్మారి గురించి జగన్ చర్యలు తీసుకోకుండా మామూలుగానే వ్యవహరిస్తున్నప్పటికీ , రాష్ట్ర ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ ఈ వ్యాధి సోకుకుండా చూసుకోవాలని చెప్పారు.

జనసమూహం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఇతరులకు కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలని, ఇలా చేసి కరోనా సోకే అవకాశాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. మన కుటుంబాల కోసం కరోనాపై మరింత బాధ్యతగా మాట్లాడుతూ, కరోనాపై అవగాహన కల్పిద్దామని పిలుపునిచ్చారు. ఈ పోస్టును నెటిజన్లు ఆకట్టుకుంటోంది. షేర్లు లైకులతో నెటిజన్లు దీనికి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది.

tags : chandrababu naidu, tdp, social media, coronavirus

Advertisement

Next Story

Most Viewed