జగన్‌ను నిలదీసిన చంద్రబాబు.. ఎందుకంటే..?

by srinivas |
జగన్‌ను నిలదీసిన చంద్రబాబు.. ఎందుకంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. గోరుచుట్టుపై రోకలిపోటుగా పన్నులు పెంచారని మండిపడ్డారు. కరోనాతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు దారులందరికీ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మృతులకు చంద్రన్న బీమా ఉంటే 10 లక్షల పరిహారం వచ్చి ఉండేదన్నారు. ప్రస్తుతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌తో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. జాబు క్యాలండర్ మార్చాలని..ఉద్యోగాలివ్వాలని అడిగిన యువతను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైందంటూ జగన్ సర్కార్‌ని చంద్రబాబు నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed