- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండున్నరేళ్లు హింసించారు.. వదిలిపెట్టను : టీడీపీ అధినేత చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్ తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి అని విమర్శించారు. అవసరాలకు ఉపయోగించుకుని ఆ తర్వాత వారిని వదిలేసే వ్యక్తి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు తల్లిని.. చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చాడని విమర్శించారు. తల్లిని ఊరూరా తిప్పారని గుర్తు చేశారు. అలాగే తనను ఎదుర్కొనేందుకు చెల్లి వైఎస్ షర్మిలను రంగంలోకి దించాడన్నారు. జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేసిందని ఇప్పుడు ఆ బాణం తెలంగాణలో తిరుగుతోందని సెటైర్లు వేశారు.
నీ చెల్లికి తల్లికి న్యాయం చేయలేని జగన్ తనపై మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు కూడా తన తల్లిని తిట్టారంటూ సెంటిమెంట్‌తో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. చివరకు తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని సైతం చంపేందుకు వెనుకాడలేదని ధ్వజమెత్తారు. హత్య జరిగిన రోజుల్లో వైఎస్ వివేకానందరెడ్డిని తానే చంపానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధిపొందారని చంద్రబాబు ఆరోపించారు.
నేడు తన తండ్రి మర్డర్‌పై వివేకానందరెడ్డి తనయ సునీతారెడ్డి పోరాటం చేస్తుంటే కనీసం సహకరించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాద పోరు దీక్ష’ ముగింపు సందర్భంగా వైఎస్ జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని వార్తపత్రికల్లో కథనాలు వచ్చాయి. డ్రగ్స్ యువత జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. రెండున్నరేళ్లుగా టీడీపీ నేతలను ఆర్థికంగా, మానసికంగా హింసిస్తున్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీపై దాడులు చేసినా.. కార్యకర్తలను హింసించినా, డ్రగ్స్‌పై తాను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. తమ పార్టీ అద్దాలను ధ్వంసం చేయగలరే తప్పా, తమలో ఉన్న మానసిక స్థైర్యం పై దాడి చేయలేరని అన్నారు. జగన్ దుష్టపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్తానని చంద్రబాబు హెచ్చరించారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ సంయమనం కోల్పోలేదని, కానీ ఈ సీఎం జగన్ సంయమనం కోల్పోతున్నాడని.. టీడీపీని టార్గెట్ చేస్తూ తన ఉగ్రవాదాన్ని బయటపెడుతున్నారని అన్నారు.