- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లు డ్రామాలాడుతున్నారు: చంద్రబాబు
దిశ ఏపీ బ్యూరో: విజయవాడలోని స్వరాజ్ మైదాన్ (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్) లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ స్థలం వివాదాస్పద స్థలమని, దానిపై కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని అన్నారు. అలాంటి వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహం పేరిట వైఎస్సార్సీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ తీరు ఆది నుంచీ వివాదాస్పదమేనని ఆయన మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత కంపెనీ ప్రతినిధులపై కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. ఆ కేసులు కూడా ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీకి చిత్త శుద్ధి ఉంటే తక్షణం ఆ కంపెనీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.